కాకుమాను మండల పరిధిలోని కొండపాటూరుకి గ్రామానికి చెందిన వృద్ధాప్య పెన్షన్ దారు రుద్రపాటి అంజయ్య అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్నాడు. వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి అంజయ్య ఇంటి దగ్గర లేడు. విషయం తెలుసుకున్న గ్రామ వాలంటీర్ కే. నాగార్జున మంగళవారం హాస్పిటల్ వద్దకు వెళ్ళి అంజయ్యకి పెన్షన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా పెన్షన్ దారు కుటుంబ సభ్యులు వాలంటీర్ నాగార్జున కు అభినందనలు తెలిపారు.