నేరాల నియంత్రణలో ప్రజలు స్వచందంగా భాగస్వాములు కావాలని కంచరపాలెం సిఐ సాయి పిలుపునిచ్చారు. ఈ మేరకు కైలాసపురం కస్తూరినగర్ తదితర ప్రాంతల్లో నేర నియంత్రణను సంబందించి సోమవారం రాత్రి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి స్తానికులలకు అవగహన కల్పించారు. ఆయా ప్రాంతల్లో అపార్ట్మెంట్ వాసులు స్తానికులు సంఘాలుగాఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. తద్వారా నేరాలకు పాల్పడే వారిని త్వరిత గతిన గుర్తించవచ్చన్నారు.