శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రకాశం భవన్ దగ్గర ఉన్నట్లుండి మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన అక్కడ విద్యార్థులు వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఎస్వీయూ క్యాంపస్‌కు చేరుకొని మంటలను ఆర్పివేశారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ కారు తమిళనాడు లా-విద్యార్థులకు చెందినట్లుగా గుర్తించారు.