రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని అన్నారు. సోమవారం ఆమె విశాఖ జిల్లా శొంఠ్యాం పంచాయతీలో రూ. 7కోట్లతో చేపట్టనున్న ఆయుర్వేద ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి. ఆనందంగా గడపాలన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తు న్నారన్నారు.