ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 02:36 PM

రాష్ట్రంలో జరుగుతున్నా అరెస్టులపై టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బండారు సత్యనారాయణ మూర్తికి  పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏ తప్పూ లేదని కూడా తాము సమర్థిస్తున్నామన్నారు. నాడు శాసనసభలో టీడీపీ నేతలపై కామెంట్లు చేసినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. స్పీకర్‌ను పక్కన పెట్టుకుని మాట్లాడినప్పుడు ఎందుకు ఖండిచలేదని నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com