యశ్వంతపూర్ నుంచి ఇండోర్ మీదుగా అంబేద్కర్ నగర్ కు వెళ్లే ఇండోర్ ఎక్స్ ప్రెస్ ఇకపై అనంతపురం జిల్లాలో ఆగనుంది. జిల్లాకు చెందిన విద్యార్థులు ఇండోర్ నగరంలో త్రిబుల్ ఐటీ చదువుతున్నారు. ఈ తరుణంలో విద్యార్థుల కోసం రైలును అనంతపురం జిల్లా లో ఆపాలని ఎంపీ తలారి రంగయ్య రైల్వే బోర్డుకు లేఖ రాయడం తో స్పందించిన అధికారులు ప్రతి మంగళవారం జిల్లాలో నడిచే ఈ రైలు సాయంత్రం 6. 53 గంటలకు అనంతపురంలో రెండు నిమిషాల పాటు ఆపనుంది.