కేంద్ర ప్రభుత్వం ఎదుట వైసీపీ ప్రభుత్వం మోకరిల్లుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం అమలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయకపోవడం దారుణమని అన్నారు. అనంతపురంలోని సోమవారం పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. మోదీ అధికారం చేపట్టాక పదేళ్లలో ఒక్క పరిశ్రమనూ స్థాపించలేదని అన్నారు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతాంగం నెత్తిన రుద్దడమే తప్ప.. వ్యవసాయాభివృద్ధికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఎదుట మోకరిల్లినందుకే రాష్ర్టానికి నిధులు రావడం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు.