మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి చేసే వ్యక్తి చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని.. అరాచకాలు చేసే వ్యక్తి బయట ఉన్నారన్నారు. ఎప్పుడు బయటకు రాని భువనేశ్వరి రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం దీక్ష చేశారన్నారు. జగన్కు ప్రజలే బుద్ధి చెబుతారని పీతల సుజాత హెచ్చరించారు.