ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్‌కు సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్‌లో కుంభకోణం అంటూ ఎన్నో ఆరోపణలు చేసిన వైకాపా నేతలు..., నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం బహిర్గతమైందన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోందన్నది స్పష్టమైoదన్నారు. ఎన్నికల వరకూ చంద్రబాబును జైల్లో ఉంచాలని జగన్మోహన్ రెడ్డి తాపాత్రయపడుతున్నారని, అందుకే హడావుడిగా గురువారం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారని అన్నారు.