ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి-లక్నో హైవేపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులతో సహా ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడని ఫుల్‌పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) దీపక్ రణావత్ తెలిపారు. ఫూల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్ఖియావ్ ప్రాంతంలో బాధితుల స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో కుటుంబానికి చెందిన ఇద్దరు, ఎస్‌యూవీ డ్రైవర్, మరో వ్యక్తి మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa