కడప నగరంలో విషాదం చోటు చేసుకుంది. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గురువారం తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.