ఆరోగ్యఆంద్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నకరికల్లు మండలం దేచవరంలో బుధవారం జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా సామాన్యులు, పేద ప్రజల మెరుగైన వైద్య చికిత్సలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు.