గుంటూరు-2 డిపోలో హెవీ మోటార్ వెహికల్ డ్రైనింగ్ స్కూల్లో, డ్రైవర్లకు త్వరలో శిక్షణ ప్రారంభించనున్నట్లు డిపో మేనేజరు షేక్ అబ్దుల్ సలామ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ డ్రైవింగ్ స్కూల్లో ఇప్పటి వరకు 12 బ్యాచ్ లు శిక్షణ పూర్తి చేసుకున్నాయని, 13వ బ్యాచ్ కు 16 మంది నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.