రాష్ట్రంలో కులగణనకు నియమించిన కమిటీ తన నివేదికను త్వరలో సమర్పించేలా ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన తెనాలిలో విలేకరులతో మాట్లాడుతూ, జనాభా లెక్కలులేని కారణంగా దేశంలో బీసీ కులాలకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా పోతోందని గుర్తు చేశారు.