ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్నిగురువారం ఉదయం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, ల్యాబ్ టెస్టింగ్, మందుల పంపిణీ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలందరూ ఈ ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.