అందరికీ మెరుగైన వైద్యం అందాలనే లక్ష్యంతో సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే కిలారి అన్నారు. గురువారం బ్రాహ్మణ కోడూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్న సురక్ష ద్వారా గుండె జబ్బులకు కూడా వైద్యం అందిస్తున్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీపీ భవనంపద్మలీల, ఎండిఓ శ్రీనివాసరావు , ఎమ్మార్వో శ్రీకాంత్ కేదార్నాథ్ పాల్గొన్నారు.