పాతగుంటూరు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లోని కూల్డ్రింక్స్, బేకరీ దుకాణాల్లో ఆహార పదార్థా ల్ని అధిక ధరలకు విక్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఏటీఎం సత్యనారాయణ వ్యాపారులకు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు గురువారం బస్టాండ్ లోని పలు దుకాణాల్ని ఆయన తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న నాలుగు దుకాణదారులకు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు.