నగర కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా, రహదారి ప్రమాదాలను నివారించేందుకు పలు బృందాలు ట్రాఫిక్ నియంత్రణపై అధ్యయనం చేశాయి. నగర పోలీసు కమిష నర్ ఎ. రవిశంకర్ ఆదేశాలతో ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు పోలీసు అధికారులు గురువారం అన్ని కూడళ్లలోను విధులు నిర్వహించి, ప్రత్యక్షంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకున్నారు.