ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబద్ధాలతో న్యాయస్థానాలను మోసం చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 06, 2023, 11:31 AM

విచారణకు వెళ్లే ఓపిక లేదు కానీ, టీడీపీ దీక్షా శిబిరాలను విజిట్‌ చేసి, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే తీరిక ఉందా నారాయణ..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. స్పష్టమైన ఆధారాలతో సీఐడీ విచారణకు రమ్మంటే నారాయణ తప్పించుకొని తిరుగుతున్నాడని, అబద్ధాలతో న్యాయస్థానాలను సైతం మోసం చేస్తున్నాడన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. విచారణకు రమ్మంటే జబ్బులు వచ్చాయి, వయసు మీదపడిందని, స్పెషల్‌ కేర్‌ అంటూ కోర్టులకు అబద్ధాలు చెబుతూ తప్పించుకొని తిరుగుతున్నాడన్నారు. సర్జరీలు చేసుకుంటే విశ్రాంతి తీసుకోవాలి కానీ, రెండు మూడురోజులకోసారి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా..? టీడీపీ దీక్షా శిబిరాలను సందర్శిస్తారా..? ప్రభుత్వాన్ని విమర్శించే తీరిక ఉన్న నారాయణకు.. విచారణకు వెళ్లే ఓపిక లేదా అని ప్రశ్నించారు. అబద్ధాలతో కోర్టులను తప్పుదోవపట్టిస్తున్నాడన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com