విద్యార్థులకు పరీక్ష పత్రాలను కూడా ముద్రించి ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజంపేట లో శనివారం నిర్వహిస్తున్న రిలే దీక్షలో మాట్లాడుతూ రెండు కోట్ల విద్యార్ధుల ప్రశ్నాపత్రాలు కోసం ఖర్చు పెట్టలేని ప్రభుత్వం మూడు రాజధానుల ను కడుతుందని చెప్పటం ఒక హేయమైన చర్య అని పేర్కొన్నారు.