సెప్టెంబర్ నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.111.65 కోట్లు వచ్చినట్టు TTD ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. గత నెలలో శ్రీవారిని 21.01 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, 1.11కోట్ల లడ్డూలు విక్రయించినట్లు తెలిపారు. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెలా రూ.100 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లు పేర్కొన్నారు.