సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బిల్డప్ సీఎం జగన్ 27 సార్లు డిల్లీకెళ్లి సాధించేందేంటి అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, త్రిబుల్ ఐటీ నిధులు, వెనుకబడిన జిల్లాల రూ.1400 కోట్ల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు. పెట్రో కాంప్లెక్స్, తిరుపతి ఐజర్‌కు నిధులు ఏమయ్యాయని అడిగారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు 9,371 ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేశామన్నారని.. వాటి రుజువులు ఏవి? పోటోలున్నాయా? విజువల్స్ ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రంలో నిజంగా గంజాయిని అరికడితే బెంగుళూరు, ఉత్తరప్రదేశ్, కేరళ, డిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే వచ్చాయని అక్కడి పోలీసు ధికారులు ఎందుకు చెబుతారని అడిగారు. బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు ఓ పార్సిల్‌ను పరిశీలిస్తే 4.49 కిలోల ఎఫిడ్రిన్ అనే మత్తు పదార్దం దొరికిందని చెప్పారన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు, తన కేసుల మాఫీకోసమే సీఎం డిల్లీ పర్యటనలు అని వ్యాఖ్యలు చేశారు. అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు. జీ20 సదస్సులో అరకు కాఫీని విదేశీ ప్రతినిధులకు గిప్ట్‌గా ఇచ్చినందుకు చంద్రన్నకు పాధాబివందనమన్నారు. అలాంటి ఉత్తరాంధ్రని గంజాయితో నాశనం చేస్తూ... కేంద్రానికి తప్పుడు నివేదికలిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.