ప్రతిపక్షాలని ఆంక్షల పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 144 సెక్షన్ టీడీపీకేనా..? వైసీపీకి లేదా..? అని ఫైర్ అయ్యారు. సురక్ష అంటూ వైసీపీ నేతలు రోడ్డెక్కడం లేదా..? అని ప్రశ్నించారు. నెలల తరబడి సెక్షన్-30 ఏంటని నిలదీశారు. సెక్షన్-30 విపరీతంగా వినియోగించడంపై కోర్టుకెళ్తామన్నారు. తెలిసిన సమాచారం ప్రకారం .. పోలీసులే లేకుంటే తాడేపల్లి ప్యాలెస్ ఉండేది కాదన్నారు. జగన్ కేసులలో అవినీతి జరిగిందని సీబీఐ, ఈడీ దర్యాప్తులో తేలిందని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబుపై ఎలాంటి ఆధారాల్లేకుండా అరెస్ట్ చేశారన్నారు. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తున్నారన్నారు.