కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుంచి తిరుమల వెళ్లెప్పుడు తొలి పాదం మోపిన ప్రాంతం వేదగిరి అని, అంత చరిత్ర కలిగిన రసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పధకం కింద ఎంపికైందని.. చాలా సంతోషంగా ఉందతీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఇక్కడ కొనేర్లు, గిరిప్రదక్షిణ చేసే ప్రాంత అభివృద్ధి, దశావతారాల వద్ద అభివృద్ధి చేసేలా అడిగామని తెలిపారు. ‘‘నా ప్రయత్నంలో నాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉషమ్మ, దీపా వెంకట్, డిఫెన్స్ అడ్వైజర్ సతీష్, అప్పటి కలెక్టర్ చక్రధర్ బాబు ఎంతగానో సహకరించారు’’ అని చెప్పారు. గణేష్ ఘాట్, ఇరుకళల పరమేశ్వరి ఆలయం, భారా షాహిద్ దర్గా అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ స్కీం కింద రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కిషన్ రెడ్డిని కోరుతున్నామని అన్నారు. నరసింహ కొండకి వెళ్లే దారిలో పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి, నూతన రోడ్లు సాంక్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ కోరుతున్నామని తెలిపారు. స్వర్ణాల చెరువు వద్ద గణేష్ ఘాట్ కోసం 1600 కోట్లతో అభివృద్ధి పనులను టెండర్లు పూర్తి అయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇంకా రాలేదన్నారు. కాంట్రాక్టర్‌కు త్వరగా సాంకేతికంగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నామని.. నుడా అధికారులు లేఖ కూడా రాశారని.. దీనిపై ప్రభుత్వం ఇంకా సంతకం చేయలేదన్నారు. భారా షాహిద్ దర్గాలో కాంట్రాక్టర్ అభివృద్ధి పనులు ఆపేసి ఉన్నారని... ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో రాజకీయాలు వద్దని ఎమ్మెల్యే హితవుపలికారు.