ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. తీసుకున్న చర్యలపై అచ్చెన్నాయుడుకి చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు. పర్చూరులో వేరే వ్యక్తుల పేర్లపై ఆన్‌లైన్‌లో ఫామ్-7 లు పంపిన 12 మంది పై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఇప్పటికే పర్చూరు ఈఆర్వో పిర్యాదు చేశారని లేఖలో కమిషన్ పేర్కొంది. బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారని మీనా పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం నకిలీ ఫామ్-7 లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకున్నట్టు మీనా పేర్కొన్నారు. కావలి నియోజకవర్గంలో అక్రమాలపై అచ్చెన్నాయుడు రాసిన లేఖపై కూడా కమిషన్ స్పందించింది. కావలిలో కూడా బల్క్ గా ఫామ్-7 లు ఇచ్చి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని పేర్కొంటూ లేఖ రాశారు. కావలిలో అక్రమాలపై విచారణకు ఆదేశించినట్లు కమిషన్ పేర్కొన్నారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు లేఖలో సీఈవో మీనా వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa