ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. జనవరి 1వ తేదీ నుంచి ఆసరా పెన్షన్లు పెంచుతామని.. వృద్ధులు, వితంతువులకు రూ.3వేల పెన్షన్ అందిస్తామని సోమవారం ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.3000 పెన్షన్ ఇస్తామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 66లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని చెప్పారు. నెలకు రూ.2వేల కోట్ల భారం చిరునవ్వుతో భరిస్తున్నామని పేర్కొన్నారు.