నేడు సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ మండల స్థాయి నేతలతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజలంతా జగనన్నే మా నమ్మకం అంటున్నారని భాగ్యలక్ష్మీ చెప్పారు. పాలనలో లోపాలను సరిదిద్దిన సంస్కర్త సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారని తెలిపారు. ఏ ఇంటికి వెళ్లినా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.