సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో కృష్ణా ఎక్స్ప్రెస్ను అధికారులు రద్దు చేశారు. ముందే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. కృష్ణా రద్దు కావడం గత రెండువారాల్లో ఇది రెండోసారి. అలాగే డోర్నకల్ ప్యాసింజర్, పుష్పుల్, బల్లార్షా ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దును ఈ నెల 15 వరకూ పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.