డిల్లీ ఆప్ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు సంబంధించిన స్థలాల్లో ఈడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహించింది. డిల్లీ ఏసిబి, సిబిఐ వక్ఫ్ బోర్డు పై నమోదు చేసిన కేసుల నేపధ్యంలో ఈడి రంగంలోకి దిగింది. మద్యం కుంబకోణం కేసులో భాగంగా ఆప్ రాజ్య సభ ఎంపీ సంజయ్ సింగ్ గత బుదవారం అరెస్టు కాగా, మంగళవారం ఓఖ్లా నియోజకవర్గ ఎమ్మెల్యే ఖాన్ ను ఏసిబి అరెస్టు చేసింది.