నెల రోజుల కిందట వందల్లో పలికి వణుకు పుట్టించిన టమాటా రేటు ఇప్పుడు దారుణంగా పడిపోయింది. కేజీ రూ. 10కి కూడా కొనే పరిస్థితి లేదు. దీంతో రైతుకు కన్నీళ్లు మిగిలాయి. సోమవారం మదనపల్లె మార్కెట్ యార్డులో 30 కేజీల బాక్సు ధర గరిష్టంగా రూ. 250 మాత్రమే పలికింది. దీంతో కూలీలు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కోతలు ఆపేస్తున్నారు. మళ్లీ రేట్లు పెరిగి తాము పెట్టిన పెట్టుబడైన వస్తుందనే నమ్మకంతో రైతన్నలు ఎదురు చూస్తున్నారు.