జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు అన్నిరకాల వైద్యసేవలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని తహసీల్దార్ జాన్ సైదులు అన్నారు. శావల్యాపురం మండలంలోని శానంపూడి గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వైద్య శిబిరానికి 294 మంది రోగులు హాజరుకాగా పలువురు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో, వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.