ఈ రోజు ఉదయం స్కిల్ డెవలప్మెంట్స్ కేసు నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చూడటానికి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి మరియు పయ్యావుల కేశవ్ వెళ్లడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పుకి జైల్లో నరకం అనుభవిస్తున్నాడని, అలాగే ఆయన ఆరోగ్యం అంతా నిలకడగా ఉందని, అలాగే నిర్దోషిగా బయటకు వస్తాను అనే ధృడమైన నమ్మకంతో ఉన్నారని కేశవ్ తెలిపారు. ఒక్కసారిగా ఇంతటి మహానుభావుడుని జైలులో చూసేసరికి చాలా బాధగా ఉందన్నారు.