ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం జరిగింది. ఓ కిరాతక అధ్యాపకుడు విద్యార్థినిని గర్భవతిని చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్లో చేరింది. యర్రగొండపాలెం మం.పాలుట్లకు చెందిన గోవింద్ నాయక్ టీచర్ గా ఉన్నాడు. ఇంటి వద్ద దించుతానంటూ విద్యార్థినిని ఓ రోజు బైక్ పై తీసుకెళ్తూ ఆమె అసభ్యకర చిత్రాలను ఫోన్లో తీశాడు. వాటితో బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.