ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో వాషింగ్టన్లో రెండ్రోజుల క్రితం రహస్య సమావేశం నిర్వహించినట్లు బ్రిటిష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. దీనిని ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ధృవీకరించలేదు.