అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి టీడీపీ నేత నారా లోకేశ్ వరుసగా రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. కాగా తొలిరోజు (మంగళవారం) ఆరున్నర గంటలపాటు సాగిన విచారణలో మొత్తం 50 ప్రశ్నలు అడిగారని లోకేశ్ తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో సంబంధం లేని అంశాలపై కూడా ప్రశ్నించారని చెప్పారు.