ఈ నెల 26నుండి బస్సు యాత్ర చేస్తున్నట్లు ఏపీ జల వనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి? ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారు. టీడీపీ నాశనం అవ్వడానికి కారణమే లోకేశ్ అని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా గమనించి నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.