బిహార్లోని బక్సర్ జిల్లా రఘునాథ్పూర్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ రైలు భోగీలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. గురువారం కేంద్ర మంత్రి అశ్విని చౌబే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు.