ఓ పోలీసు అధికారి టికెట్ లేకుండా వందేభారత్ రైలు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీటీఈ వచ్చి ఈ ఇన్స్పెక్టర్ను టికెట్ చూపించాలని అడిగారు. అయితే తాను పోలీసునని, టికెట్ అవసరం లేదని ఆ ఇన్స్పెక్టర్ చెప్పినట్లు ఈ వీడియోలో ఉంది. టికెట్ లేకుండా రైలు ఎక్కడానికి వీల్లేదని టీటీఈ చెప్పి వచ్చే స్టేషన్లో దించేసినట్లు సమాచారం. రాజ్ బి.సింగ్ అనే ఓ జర్నలిస్టు ఈ వీడియోను షేర్ చేశారు.