స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. అక్టోబర్ 17వ తేదీన దీనిపై విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఇదే కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.