చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగు పల్లి బోయకొండ గంగమ్మ ఆలయ నూతన ఛైర్మన్ నాగరాజ, మరియు బోర్డ్ సభ్యులు శుక్రవారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నాగరాజ, సభ్యులు మంత్రి పెద్దిరెడ్డికి తెలియజేశారు.