రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి సీఎం జగనన్న ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం పాకాల మండలం పెద్దరామాపురం పంచాయతీలో మోహిత్ రెడ్డి గడప గడపకు మహా పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. పల్లె ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి గడపలో మహిళలు కుటుంబ సభ్యుడుగా ఆత్మీయతను కనబరిచారు.