తుంగభద్ర దిగువ కాల్వకు జనవరి వరకు సాగునీరు ఇవ్వాలని సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గురువారం ఎమ్మిగనూరులోని టీబీపీ కాలనీలో ఉన్న కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ఉపాధ్యక్షుడు పంపన్న గౌడు మాట్లాడుతూ. తుంగభద్ర జలాశయం ఎల్లెల్సీ, హెచ్ఎల్సీ కాలువ కింద ఉన్న ఆయకట్టు భూములకు నీటిని నవంబరు 10వ తేదీ. వరకు సరఫరా చేస్తామని బోర్డు అధికారులు నిర్ణయించడం దారుణ మన్నారు.