ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త తెలిపింది. రిజర్వేషన్ రద్దు చేసుకునే వారి కోసం గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. టికెట్‌ను రద్దు చేసుకోకుండా మరొకరికి షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు. ప్రయాణానికి 24 గంటల ముందు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. రిజర్వేషన్ కౌంటర్లో టికెట్‌తోపాటు బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి వివరాలను అందించాలి.