కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రసార భారతి కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ కానుంది. పరిశ్రమలోని ఇతర ప్రముఖ సంస్థల సహకారంతో ఓటీటీ సేవలు అందించాలనే యోచనలో ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సేవలను అందించాలని చూస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఈ-టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపింది. అయితే నవంబర్ 1 నుంచి బిడ్లు తెరవనున్నట్లు స్పష్టం చేసింది.