గుత్తి పట్టణంలోని చెర్లోపల్లి కాలనీలో గురువారం అర్ధరాత్రి మున్సిపల్ వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఏ కారణంగానో వేగంగా వచ్చిన ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఐతే ఆ సమయంలో రహదారిపై జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్ డ్రైవర్ తిమ్మప్పకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాన్స్ కో, మున్సిపల్ సిబ్బంది అక్కడ చేరుకొని పరిశీలించి కొంతసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.