ధర్మవరంలోని యాదవవీధి కి చెందిన ఆటో డ్రైవర్ నారాయణస్వామి గురువారం రాత్రి విషపుద్రవం తాగి ఆత్మహత్యాయత్నంచేశాడు.కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో కొనుగోలుకు,నిర్వహణకు చేసిన అప్పులు తీర్చేదెలా అని కలత చెంది నారాయణస్వామి ఆత్మహత్యాయత్నం చేశాడని ఒకటోపట్టణ పోలీసులు తెలిపారు.