ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి లోని బ్రాంచ్ కెనాల్ లోకి శుక్రవారం సాగర్ జలాలు చేరుకున్నాయి. ఇటీవల త్రాగునీటి సమస్య వస్తుందని ప్రజలు అనుకున్నప్పటికీ నీటి సరఫరా జరగడం వలన సమస్యకు పరిష్కారం జరిగిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. అధికారులు నీటిని నిల్వ ఉంచి ఎన్ఏపీ రక్షిత త్రాగునీటి ద్వారా విడుదల చేయాలని వారు కోరుకుంటున్నారు.