ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం రైల్వే అండర్ పాస్ దగ్గర మహిళా ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని గుట్టుమీద పల్లి గ్రామానికి చెందిన రిట మేరీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. ఆరోగ్యం సమస్య ఎక్కువ అవడంతో బాధ తట్టుకోలేక నా చావుకు ఎవరు కారణం కాదని లెటర్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.