'ఆపరేషన్ అజయ్'లో భాగంగా 274 మంది భారతీయులతో కూడిన నాలుగో విమానం ఆదివారం తెల్లవారుజామున భారత్కు బయల్దేరింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపారు. ఇజ్రాయెల్లో ఉన్న దాదాపు 18,000 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రధాని మోడీ ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించారు. హమాస్ టెర్రరిస్టుల దాడితో ఇజ్రాయెల్లో 1,300 మందికి పైగా మరణించారు.