తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసినందుకు టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కరణం శివరామకృష్ణ శనివారం రాత్రి గజపతినగరం మండలంలోని రంగు పురం గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. కక్షపూరిత రాజకీయాలు పరాకాష్టకు చేరాయి అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.